|

Allu Arjun Trivikram Movie Story Leaked

Allu Arjun's upcoming film under the direction of Trivikram Srinivas has been having its shooting done with a brisk pace.

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ లీకైందంటూ ఓ స్టోరీ నెట్ లో ప్రచారమవుతోంది. ఆ కథ ప్రకారం...కథలో ఇద్దరు ప్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరివీ డిఫెరెంట్ ఏటిట్యూడ్స్. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. ఇద్దరూ ఓవర్ నైట్ లో కోటీశ్వరలు అయ్యిపోవాలని కలలు కంటున్న వారే. అతి తక్కువ సమంయంలో అతి ఎక్కువ సంపాదించి సెటిలవ్వాలనుకునేది ఇద్దరి కోరిక. అయ్యితే ఇద్దరూ తమ లక్ష్యాలను సాధించటానికి వేర్వేరు దారులను ఎంచుకుంటారు. ఒకరు పద్దతైన దారిలో వెళ్లి సక్సెస్ అయ్యితే,మరొకరు ఫెయిల్యూర్ అవుతారు. ఆ ఇద్దరూ అల్లు అర్జున్,సోనూసూద్. పూర్తిగా కామెడీతో చెప్పబడ్డ ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పోలీస్ గా కనిపించి నవ్వించనున్నారు.

ఇక ఈ కథ కరెక్టా కాదా..అస్సలు కథేంటి అనేది తెలియాలంటే విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ తాజాగా మరో పెద్ద చిత్రాన్ని ఒప్పుకున్నారు. యాక్షన్‌ చిత్రాల నిర్మాణంలో తనదైన శైలిగల దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత. త్రివిక్రమ్‌ చిత్రం పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌ ఈ కొత్త చిత్రంలో నటిస్తారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Posted by Andhra Gossips on 21:38. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips