Ileana Suffering From Stomach Infection
Iliyana suffering from a stomach infection, cancelled her dates for Barfee and the producer reportedly even dismantled the set in Mumbai’s Film City.
రీసెంట్ గా ఇలియానా స్టమక్ ఇన్పెక్షన్ తో బాధపడింది. దాంతో ఆమె డేట్స్ సమస్యలో పడ్డాయి. ఆమె ప్రస్తుతం చేస్తున్న అల్లు అర్జున్,రణబీర్ కపూర్ సినిమాల మధ్యన ఏ సినిమాకు తదుపరి డేట్స్ ఇవ్వాలనే ఆలోచనలో పడింది. అయితే తనకు ఇష్టమైన తెలుగు ఫీల్డ్ కే ఓటు వేసి ఇక్కడ డేట్స్ ఇచ్చింది. దాంతో జనవరి నెలాఖరుదాకా రణబీర్ కపూర్ తో చెయ్యాల్సిన డేట్స్ మొత్తం పెండింగ్ లో పడ్డాయి. ఆ విషయమై ఓ ఇంగ్లీష్ డైలీ రాస్తూ ఇలియానాకు అల్లు అర్జున్ అంటేనే ఆసక్తి కాబట్టి ఇటు వైపే ఆమె మ్రొగ్గింది అంది.
ఆమె ఓ ప్రక్క ట్రీట్ మెంట్ తీసుకుంటూ,ఆరోగ్యం సహకరించకపోయినా భాధ్యతగా వ్యవహిస్తోంది. పిబ్రవరి 13 లోగా అల్లు అర్జున్ సినిమాకి ఇచ్చిన డేట్స్ ని ఫినిష్ చేసుకుని రణబీర్ కోసం డార్జిలింగ్ వెళ్లభోతోంది. ఇక అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ చిత్రం రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందులో రాజేంద్రప్రసాద్ ఓ పోలీస్ గా కనిపించి నవ్వించనున్నారు