|

Ram Charan Plays a Robin Hood Role?

Ram Charan Teja and Kajal Aggarwal are pairing up again. The duo will be seen together in none other than VV Vinayak's next film.


రామ్ చరణ్ త్వరలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనపడి అలరించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ తరహా క్యారక్టరైజేషన్ ఉండబోతుందని అంటున్నారు. పెద్దలను కొట్టి ..పేదలకు పెట్టే పాత్రలో రామ్ చరణ్ అదరకొడతాడని చెప్పుకుంటున్నారు. ఆ పాత్ర మాస్ కి బాగా నచ్చుతుందని, ఆ పాత్రలో రామ్ చరణ్ ఎక్సట్రీమ్ లెవిల్స్ వెళ్లి ఫెరఫార్మ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కథ ప్రకారం హీరో తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఏం చేసాడనే పాయింట్ చుట్టూ తిరిగుతుంది. కథలో చిన్నపాటి టెన్షన్ కూడా ఉంటుంది. మంచి యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ సినిమా.

గతంలో వినాయిక్ చిత్రాలైన లక్ష్మి,కృష్ణలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ..ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారు. కణల్‌ కన్నన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ బ్యానర్ పై నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.'మగధీర' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.


Posted by Andhra Gossips on 20:32. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips