రోజుకు 20 సిగరెట్లు తాగిస్తున్నారు : తెలుగు హీరోయిన్
తెలుగు, ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా వెలుగొందుతున్న మధుశాలినికి దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను బాలీవుడ్ లో రూపొందిస్తున్న ‘ డిపార్ట్ మెంట్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. మధు శాలిని ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తోంది. రౌడీ లేడీ ఆటిట్యూడ్‌తో సిగరెట్లు తాగుతూ కనిపిస్తుంది మధు శాలిని. సినిమా షూటింగులో భాగంగా రోజుకు 20 సిగరెట్లు ఆమెతో తాగిస్తున్నాడట దర్శకుడు రాంగోపాల్ వర్మ.
ఈ విషయమై మధు శాలిని మాట్లాడుతూ..సిగరెట్ కంపు అంటే నాకు అస్సలు పడదు, కానీ సూటింగ్ సమయంలో పాత్ర డిమాండ్ మేరకు దాదాపు 20 సిగరెట్ల వరకు తాగాల్సి వస్తోంది. నటించడం కంటే ఇలా సిగరెట్లు తాగడమే చాలా కష్టం ఉందని పేర్కొంటి మధు శాలిని.
రామ్ గోపాల్ వర్మకు, తనకు మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలను మధు శాలిని ఖడించారు. మా ప్రొఫెషన్ లో భాగంగా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇలా ఎఫైర్ అంటగడతారా? అంటూ మండి పడుతోంది.
డిపార్టుమెంట్ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
