ఎన్టీఆర్, శ్రీనువైట్ల చిత్రం టైటిల్ ఖరారు
జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో చెయ్యబోయే చిత్రానికి చెందిన రకరకాల టైటిల్స్ చాలా కాలం నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టైటిల్ ని కన్ఫర్మ్ చేసారని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ గా యాక్షన్ అని... ట్యాగ్ లైన్ గా ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఒకే అయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, శ్రీను వైట్ల తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
‘దూకుడు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల డెరైక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఎన్టీఆర్‌తో ఆమె ఇంతకుముందు ‘బృందావనం’లో నటించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మార్చిలో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ -‘‘శ్రీను వైట్ల, నేను కలిసి ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మంచి కథ కుదిరింది. శ్రీను స్టోరీలైన్ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యా’’ అని చెప్పారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే, నా చిత్రాల శైలిలో వినోదాన్ని మిక్స్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’’ అని తెలిపారు.అలాగే దూకుడుకి పనిచేసిన కోనవెంకట్,గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు
