"పంజా" దెబ్బతో మారిపోయిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్
'పంజా' సినిమా పవన్‌కళ్యాణ్‌ను మార్చేసింది. ఆ చిత్ర నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, నగేష్‌లు ఎన్.ఆర్.ఐ.లు. ఇద్దరూ పవన్‌కళ్యాణ్ అభిమానులు. యు.ఎస్.లో వీరు పవన్ పేరుతో పలు కార్యక్రమాలు చేశారు. పైగా నీలిమ తల్లి నిర్మలమ్మ చిరంజీవి అభిమాని.
పి.ఆర్.పి. పార్టీ పెట్టిన తర్వాత ఆమె భారీగా ఖర్చు చేసింది. టిక్కెట్ కూడా ఆశించి భంగపడింది. దాంతో పవన్‌కళ్యాణ్ సినిమాకు డేట్స్ దొరికాయి. దొరికిన వెంటనే ఎస్.జె. సూర్యతో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో అతనే విష్ణువర్ధన్‌కు నిర్మాతల్ని పరిచయం చేశాడు. దాంతో 'పంజా' సినిమా మొదలైంది.
సినిమా విడుదల తర్వాత ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నిర్మాతలు బాగా లాస్ అయ్యారని గ్రహించిన పవన్‌కళ్యాణ్.. మళ్ళీ వారితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం గబ్బర్‌సింగ్ షూటింగ్ బిజీలో ఉన్న పవన్ ఆ తర్వాత మంచి కథతో ముందుకు వద్దామని వారికి హామీ ఇచ్చాడు. ఇలా సినిమా చేయడం మంచి పరిణామమే.
