Dabangg Item Girl in Gabbar Singh
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ చిత్రం 'దబాంగ్'కు రిమేక్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 'దబాంగ్'లో మంచి పాపులర్ అయిన ఐటమ్ సాంగ్.. "మున్నీ బద్నామ్ హుయి.." అనే పాటకు నర్తించే భామపై పలు రకాల ఊహాగానాలు వచ్చాయి.
తొలుత ఈ పాటను అనుష్క చేత చేయించాలని భావించారు. ఆ తర్వాత మొన్నీమధ్య మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో అర్థనగ్న ప్రదర్శన చేసి పార్వతీ మెల్టన్‌ను ఎంపిక చేశారని, పిమ్మట సన్ననడుం చిన్నది ఇలియానాను బుక్ చేసినట్ట వార్తలు గుప్పుమన్నాయి.
వాస్తవానికి ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ పాటని 'దబాంగ్'లో ఒరిజినల్ సాంగ్‌కు చిందులేసిన మలైకా అరోరాతోనే చేయించాలని హరిష్‌శంకర్, నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించుకున్నారట. అదే నిజమైతే తెలుగు తెరపై మున్నీ తన చిందులతో తెలుగు ప్రక్షకులని ఓ రేంజ్‌లో చిందులేయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట.

