|

Krish Movie Starts on Mahesh Birthday

Super Star Mahesh Babu is set to act in a new movie under the direction of Krish. Aswini Dutt is going to produce the movie on Vyjayanti Movies banner. The regular shooting of the film will begin from this August 9, which happens to be the birthday of Mahesh Babu.


సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో గమ్యం, వేదం చిత్రాల ఫేం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ రెడీ చేశారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వై.జయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన ‘రాజకుమారుడు’ సినిమా ఇదే బ్యానర్లో రూపొందింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ బ్యానర్లో మహేష్ బాబు పని చేస్తున్నాడు. 

తొలుత ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత అందిస్తారని వార్తలు వినిపించినా......చివరగా మణిశర్మను ఓకే చేసినట్లు తెలుస్తోంది. గతంలో మహేస్ బాబు-మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి ఆడియో పరంగా మంచి విజయం సాధించాయి. 

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకీ సరసన జర్నీ ఫేం అజంలి హీరోయిన్ గా ఎంపికైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Posted by Andhra Gossips on 06:34. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips