శ్రియ సినిమా చూసి మెచ్చుకున్న అన్నాహజారే
అవినీతిపై ఎడతెగని ఉద్యమం చేస్తున్న అన్నాహజారే ..రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ శ్రియను మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా మీడియాకు తెలియచేసింది. ఆమె మాట్లాడుతూ..నేను నటించిన గలీ గలీ మే చోర్ హై చిత్రం లంచగొండితనం మీద తీసింది. ఈ చిత్రాన్ని ఆయనకు ప్రత్యేకంగా చూపి మేము కూడా అవినీతికి వ్యతిరేకంగా పొరాడుతున్నాం అని చెప్పాలనుకున్నాం. అందుకోసం ఆయన గ్రామం వెళ్లటం జరిగింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది..ఆ ఊళ్లో స్క్రీనింగ్ వేయటానికి ధియోటర్స్ లేవని. దాంతో మేము ఓపెన్ ఆడిటోరియంలో ఎల్ సిడీ వాల్ స్క్రీన్ పైన వేసి ఆయనకు చూపించాం అంది. అలాగే ఆయన ఈ చిత్రం చూసి చాలా మెచ్చుకున్నారు. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన అంతటి గొప్ప వ్యక్తి సినిమాని చూసి ఎంకరేజ్ చేయటం నేను మెచ్చుకోలేను అంది.
ఇక ఈ చిత్రం ఓ పొలిటకల్ సెటైర్. భరత్ అనే కామన్ మ్యాన్ చుట్టూ తిరిగే కథ అది. ఆ కామన్ మ్యాన్ గా అక్షయ్ ఖన్నా చేసారు. ఆయన భార్యగా శ్రియ చేసింది. కామిడీతో నడిచే ఈ చిత్రం ఎంతలా భూఫాల్ లోని ఓ చిన్న టౌన్ నేపధ్యంలో కథ జరుగుతుంది. అక్కడ అవినీతి ఏ రేంజిలో పాతుకుపోయిందో చూపుతుంది.
