మేమేం కావాలని 'దమ్ము'లో పెట్టలేదు
'అదుర్స్', 'కంత్రి', 'బృందావనం' సినిమాల్లో ఎన్టీఆర్ ఇద్దరు హీరోయిన్స్ తో ఆడిపాడారు. ఇప్పుడు ఆ ఫార్ములా 'దమ్ము' సినిమాలోనూ కనిపించనుంది. త్రిష, కార్తీక కలిసికట్టుగా ఎన్టీఆర్‌ని ప్రేమలో దించడానికి చూస్తున్నారు..కావాలనే మీరు ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నారా అని మీడియా వారు బోయపాటి శ్రీనుని అడిగితే... ''మేమేం కావాలని ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టలేదు. కథ ప్రకారం ఇద్దరూ ఉండాల్సిందే. త్రిష, కార్తీక రెండు పాత్రలు కూడా పోటా పోటీగానే ఉంటాయి. సినిమా చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంద''ని 'దమ్ము' దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. అలాగే ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
బోయపాటి శ్రీను, త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.
