Rana Daggubati in a Hollywood Film
Rana is all set to make his Hollywood debut soon. The movie has been titled ‘A momentary lapse of Reason’.
రానా ఓ హాలీవుడ్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే సంగతి తెలిసిందే. ఈ మేరకు అప్పట్లో ట్రైల్ షూట్ కూడా జరిగింది. ఇప్పుడు ఆ చిత్రానికి టైటిల్ గా ఎ మొమంటరీ లాప్స్ ఆఫ్ రీజన్ అనే టైటిల్ పెట్టారు. లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్ మ్యాన్ గా రానా కనిపించనున్నాడు. అక్కడ సిటిలో ఉన్న అండర్ వరల్డ్ మీద రివేంజ్ తీర్చుకునే పాత్ర ఆయనది. ఆదిత్య బట్టాచార్య అనే డైరక్ట్రర్ దీనిని డైరక్ట్ చేయనున్నాడు. ఆదిత్య బట్టాచార్య గతంలో అమీర్ ఖాన్ తో రాఖ్ అనే చిత్రం రూపొందించారు.
బసు బట్టాచార్య కుమారుడైన ఆదిత్య ఆ తర్వాత కొన్ని యుఎస్ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. ఆ తర్వాత సెన్సో యునీకో అనే ఇటాలియన్ చిత్రం రూపొందించారు. ఇక దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా ని చూసి ఎంపిక చేసుకన్నాడని, ట్రైల్ షూట్ కూడ రహస్యంగా హైదరాబాద్ లోనే జరిగిందని చెప్తున్నారు. ఇక రానా తాజా చిత్రం నా ఇష్టం మొన్న శుక్రవారం విడుదలైంది. ప్రకాష్ తోలేటి అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
