Balakrishna Adhinayakudu Dialogues
బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో డైలాగులు అంటూ నెట్ లో కొన్ని ప్రచారం పొందుతున్నాయి. అవి కావాలని కొందరు క్రియోట్ చేసిన డైలాగులేనని,సినిమాలో ఉండే అవకాసం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఫేస్ బుక్,యూ ట్యూబ్ లలో వీటిని ప్రచారం చేస్తున్నారు. ఆ డైలాగులలో కొన్ని ఇలా ఉన్నాయి.
నేను కొట్టేటప్పుడు నా చేయి మాత్రమే పని చేస్తుంది...నేను కొట్టాక నీ బాడీలో ఏ పార్టూ పనిచేయదు
నేను జనరల్ గా కొట్టను,కొడితే జనరల్ హాస్పటల్ లో పేషంట్ గా కూడా పనికిరావు
నా దెబ్బ పడ్డాక అబ్బాఅనటం తప్ప ,నీ అబ్బ దిగివచ్చినా ఏమి చేయలేదు
రోషంగా తిప్పే నా మీసం మీద ఒట్టు ,బండలా ఉండే నీ కండ మీద ఒట్టు....చాచి పెట్టి కొట్టానంటే నీ గోచి ఊడిరావలసిందే
పిచ్చి పిచ్చిగా ఉందా ఏం ? నేను కొట్టాకా ఎవరైనా ఎలా ఉంది అని రివ్యూ అడిగేలోపు నరకం ప్రివ్యు కనిపిస్తుంది
ఇక చిత్రం విషయానికి వస్తే... బాలకృష్ణ అభిమానలుకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అంటున్నారు దర్శకుడు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
