Latest Twist in Jr NTR Dammu
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము ఏప్రియల్ 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై రోజుకో వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకిత్తిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర రివిల్ అయ్యే ఓ ట్విస్టు గురించి చర్చ జరుగుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి ఆ ట్విస్ట్ సినిమాకు కీలకమై నిలుస్తుందని,ఎన్టీఆర్ గత చిత్రం సింహాద్రిని గుర్తు చేసే విధంగా ఆ ట్విస్ట్ ని ప్లాన్ చేసారని చెప్తున్నారు. ఆ మలుపు వరకూ ఎంటర్టైన్మెంట్ తో నడిచిన చిత్రం ఒక్కసారిగా ప్రి ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీన్స్ తో వేడిక్కి..క్లైమాక్స్ వరకూ పరుగెడుతుందని అంటున్నారు.
ఫార్ములాగ నడిచే కథనమే అయినా కొత్త తరహా ట్విస్టు తో ఎన్టీఆర్ ని ఈ చిత్రం బోయపాటి ఒప్పించాడని,అదే రేపు ఈ సినిమాకు బ్యాంకింగ్ పాయింట్ అని చెప్తున్నారు. పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ని ప్రత్యేకంగా బోయపాటి చాలా శ్రద్దతో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ రూపొందించాడని అంటున్నారు. ఈ ట్విస్ట్ తో బోయపాటి హ్యాట్రిక్ కొడతాడని,ఎన్టీఆర్ కి ఊసరవెల్లితో వచ్చిన ప్లాప్ ఇమేజ్ ని ఒక్కసారిగా తొలిగిస్తుందని చెప్పుకుంటున్నారు. ఆ ట్విస్టు సైతం కార్తిక సైడ్ నుంచి వస్తుందని కొందరు అంటున్నారు.
ఇక దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్ లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు.
వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.
దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.
