I am not Interested in Politics
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఇప్పుడున్న రాజకీయాలు కలుషితం అయిపోయాయని సినీనటుడు సుమన్ అన్నారు. చిత్తూరు జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు సినిమాల్లో కొనసాగడమే ఇష్టమని తేల్చి చెప్పారు. మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని అడగ్గా...పేదలకు సేవ చేసే పార్టీకి తన మద్దతు ఉంటుందని సమాధానం ఇచ్చారు.
ఓ వైపు చిరంజీవి-బాలయ్య మధ్య సినిమాల వార్ ముగిసి రాజకీయ వార్ ఇప్పుడిప్పుడే మొదలైన నేపథ్యంలో.....సుమన్ రాజకీయాలపై ఇలా స్పందించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం సుమన్ హీరోగా వీరంగం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
