|

I am Ready to Act as Vilan Also


కథానాయకులకు హీరోలుగా చేసి బోర్‌ కొట్టిందో ఏమో కానీ... విక్టరీ వెంకటేష్‌ మాత్రం ప్రతినాయకుడు పాత్రలంటే ఇష్టమంటున్నారు. "చిన్నతనం నుంచీ నేను విలన్‌ క్యారెక్టర్‌ అబ్జర్వ్ చేవేసేవాడిని. ఆ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే.. హీరో పాత్ర అంత ఎలివేట్‌ అవుతుంది. 
అందుకే నాకు విలన్‌ పాత్రలంటే ఇష్టం... కానీ ఎందుకనో నాకు అటువంటి పాత్రలు రావడంలేదు. అవివస్తే తప్పకుండా చేస్తానంటున్నారు.. వెంకీ. వెంకటేష్ నటించిన 'బాడీగార్డ్‌' ఈ నెల 14న విడుదలకానుంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాడీగార్డ్‌ కథ మొదట నాకే వచ్చింది. అప్పుడు బిజీగా ఉండటంతో కుదరలేదు. మళ్ళీ ఆ అవకాశం నాకే వచ్చింది. లేదంటే.. మలయాళం కంటే ముందే తెలుగులో రావాల్సింది. దేనికైనా టైమ్‌ రావాలి అన్నారు. 

లేటెస్ట్‌గా.. మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో చేయనున్నారు. అది ఈ నెల 18 నుంచి షూటింగ్‌ ఉంటుందనీ, నా పక్కన కొత్తమ్మాయిని ఎంపకి చేశారనీ. త్రిష మాత్రం కాదని అన్నారు. నాది, త్రిషది మంచి పెయిర్‌. కానీ... ఈ సినిమాకు కొత్త అమ్మాయి బాగుంటుందని దర్శకుడు సూచించడంతో అలా చేయాల్సి వచ్చిందన్నారు.


Posted by Andhra Gossips on 22:43. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips