జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ చిత్రం డీటేల్స్
మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నందమూరి చిన్నోడు జూ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు మరిన్ని బయటికి వచ్చాయి. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, 2012 ఆగస్టు తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం హారిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ చిత్రం చేస్తున్నాడు. ఏప్రిల్ కల్లా ఈ చిత్రం కానుంది. అనంతరం హారిస్ శంకర్ జూనియర్ తో చేసే సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్కు మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా జూనియర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న ‘దమ్ము’ చిత్రం పూర్తయి, శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయాలనుకుంటున్న సినిమా చివరి దశకు చేరుకుంటుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2013 ప్రథమార్థంలో జూ ఎన్టీఆర్, హారిష్ శంకర్ కాంబినేషన్లో సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.
