Jr NTR Relation Cuts With Telugu Desam Party ?
తెలుగుదేశంతో జూ ఎన్టీఆర్ కట్?
తెలుగుదేశం పార్టీతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు తెగిపోయినట్లు చెబుతున్నారు. పార్టీలో వారసత్వ పోరుకు తెర తీసి ఇబ్బందులు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం చేసుకోవడమే మంచిదని భావించారని వినికిడి. స్టూడియో ఎన్ టీవీ చానెల్‌ను జూ.ఎన్టీఆర్ తన కుమారుడు నారా లోకేష్ నుంచి లాగేసుకోవడంతో చంద్రబాబు ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. నిజానికి, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గర చేసింది చంద్రబాబు నాయుడే. దాంతో బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆదరించారు. పెళ్లి జరిగిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయారని చంద్రబాబు భావిస్తున్నారట.
జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోకుండా, రాజకీయాల్లో ముందడుగు వేయకుండా చంద్రబాబు తన బావమరిది, సినీ హీరో బాలకృష్ణను ముందు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇది మరో బావమరిది నందమూరి హరికృష్ణ అసమ్మతికి కూడా బ్రేకులు వేయడానికి కూడా బాలకృష్ణ మంత్రమే ఆయన ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాలతో తెగ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.
