One More Movie on Silk Smitha's Life
సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ‘డర్టీ పిక్చర్’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. సిల్మ్ స్మిత పాత్రధారి విద్యాబాలన్ నటన, అందాల ఆరబోత సినిమాకు హైలెట్ గా నిలిచి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. అయితే డర్టీ పిక్చర్ స్మిత జీవితం నుంచి ఇన్‌స్పైర్ అయి, కొన్ని కల్పితాలను జోడించి తీసిందే తప్ప.....పూర్తి వాస్తవమైన కథ కాదు.
తాజాగా సిల్క్ స్మిత జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు ఆవిష్కరిస్తూ ఓ సినిమా రూపొందబోతోంది. స్మిత అసలు పేరు విజయలక్ష్మి. సినీ పరిశ్రమలో పని మనిషి స్థాయి నుంచి ఐటం స్టార్ గా ఎదిగింది. విజయలక్ష్మికి ఇంత గుర్తింపు రావడాకి కారణం దర్శకుడు విను చక్రవర్తి. ఆయన సినిమా అవకాశం ఇవ్వబట్టే ఆ స్థాయికి ఎదిగింది. ఆమె పేరును సిల్మ్ స్మితగా మార్చింది కూడా ఆయనే. ‘వంది చక్రం’ సినిమా ద్వారా స్మితను వెండి తెరకు పరిచయం చేశారాయన.
డర్జీ పిక్చర్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో....స్మిత జీవితంలోని అసలు వాస్తవాలు, ఆమె జీవితంలో తాను దగ్గర నుంచి గమనించిన విషయాలను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారాట విను చక్రవర్తి. ప్రస్తుతం ఆయన వయస్సు 66. ప్రజెంట్ సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా స్మిత జీవితం గురించి తన సినిమా ద్వారా ఈలోకానికి చెప్పేందుకు ఆసక్తిగా ఉన్నారట.
డర్టీ పిక్చర్ సినిమా రూపొందించేప్పుడు ఆ సినిమా దర్శక నిర్మాతలు తనను కలిసి వాస్తవాలను తెలుసుకోక పోవడంపై కాస్త మనస్తాపంగా ఉన్న విను చక్రవర్తి, డర్టీ పిక్చర్ సిల్క్ జీవిత విశేషాలు కాదని చెప్పేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
