|

Pawan Kalyan 3D Movie is a Rumour



పవన్ కళ్యాణ్ త్వరలో ఓ త్రీడి చిత్రం చేయబోతున్నాడని,అదీ హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ప్రీమేక్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ రూమర్స్ అని పవన్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అస్సలు పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమానే లేదని,అలాంటిది ఈ వార్త ఎలా పుట్టిందో తెలియటం లేదని వారు చెప్తున్నారు. ఇక ఈ త్రీడి వార్త ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ప్రచురించిన న్యూస్ తో స్ప్రెడ్ అయ్యింది. ఆ డైలీ మీద ఉన్న నమ్మకంతో అంతా దాన్ని నమ్మి ప్రచారం చేసారు. అయితే ప్రస్తుతం పవన్ కేవలం కథలను వింటున్నాడని,అంతేగానీ ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. త్వరలోనే తన తదుపరి చిత్రం గురించి ఓ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తాడని వారు అంటున్నారు. 

ఇక ప్రస్తుతం పవన్ దృష్టి అంతా గబ్బర్ సింగ్ మీదే ఉందని అంటున్నారు. రెండు రోజుల క్రితం గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ స్టిల్స్ విడుదలై అంతటా సంచలనం క్రియేట్ చేసాయి. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రంలో పవన్ ఓ పోలీస్ అధికారిగా కనపిస్తారు. రెక్లెస్,భాధ్యత కలగలిపిన ఓ భిన్నమైన క్యారెక్టరైజేషన్ తో ఈ చిత్రం నడుస్తుంది. పవర్‌స్టార్ మార్క్ కామెడీకి కూడా ఈ సినిమాలో లోటు ఉండదు. ఇక శ్రుతిహాసన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. హరీష్‌శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన్ను దర్శకుడిగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నాగబాబు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.

Posted by Andhra Gossips on 00:41. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips