|

పవన్ ‘ఏడుకొండలు-చిత్ర’


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘ఏడు కొండలు-చిత్ర’ అనే టైటిల్ పేరుతో అభిమానుల ముందుకు రాబోతున్నాడని, ఊసరవెల్లి దర్శకుడు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారని, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ మీదనకు రానున్నట్లు తెలుస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రోమా అస్రాని హీరోయిర్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన ఇన్ని వార్తలు బయటకు వస్తున్నా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హారిష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ గా కనిపించబోతున్నాడు. మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. సీరియస్ యాక్షన్ నేపథ్యంగా వచ్చిన ‘పంజా’ సినిమా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. అయితే ‘గబ్బర్ సింగ్’ మాత్రం పవన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో, వినోదాత్మకంగా రూపొందించినట్లు స్పష్టం అవుతోంది.


Posted by Andhra Gossips on 03:52. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips