|

తప్పు కి ఫైన్ కట్టాగా ఇంకేంటి?:తమన్నా


తెలియక చేసిన ఒక తప్పుకి ఇంతలా నిందించడం పద్దతి కాదు..వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది తమన్నా. ఆమె రీసెంట్ గా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్సించుకున్నప్పుడు జీన్స్, టీషర్ట్ ధరించడం వెళ్ళింది. అది పెద్ద వివాదం అయ్యింది. ఎందుకంటే తిరుపతిలో ఈ తరహా వస్త్రధారణను నిషేధించారు. ఈ కారణంగా తమన్నా అందరి చేతా విమర్శించబడుతోంది. సినీ స్టార్ అయ్యినంత మాత్రాన తన ఇష్టమొచ్చినట్లు గుడికి వెళ్తుందా...ఏం ఆమెకు గుడికి ఎలా వెళ్లాలో తెలియదా? మన సంస్కృతీ సంప్రదాయాల మీద అవగాహన లేదా.. అంటూ మండిపడుతున్నారు. దాంతో ఆమె మీడియాతో ఈ విషయమై ఇలా స్పందించారు. అలాగే తిరుపతి గుడిలో ఇలాంటి ఓ రూల్ ఉందన్న సంగతి నాకు తెలియదు. తెలియక చేసిన ఒక తప్పుకి ఇంతలా నిందించడం సబబు కాదు అంది. అలాగే తాను ఈ తప్పు చేసినందుకు దేవస్ధానం రూల్స్ ప్రకారం ఫైన్ కట్టానని చెప్పుకొచ్చింది.

ఇక రెగ్యులర్ గా నేను ఏ గుడికి వెళ్లినా చీర లేక చుడిదార్ వేసుకుని వెళతాను. ఆ రోజు అప్పటికప్పుడు గుడికి వెళుతున్నామని చెప్పడంతో డ్రెస్ మార్చుకోవడానికి కూడా టైమ్ దొరకలేదు. నేను వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని దాదాపు ఏడాది అయ్యింది. ఈ అవకాశాన్ని వదలుకోకూడదని గుడికి వెళ్లాను. మనసారా స్వామివారిని దర్శించుకున్నాను. కానీ ఈలోగా నా డ్రెస్ పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. ఆలయ అధికారులు ఈ విషయాన్ని పెద్దది చెయ్యటం లేదు. స్వామిని దర్శించుకున్న నేను ఆనందంగానే ఉన్నాను. మధ్యలోవాళ్లు మాత్రం ఈ విషయాన్ని చిలవలు పలవలు చేస్తున్నందుకు బాధగా ఉంది అంది.‘రచ్చ’ షూటింగ్ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తమన్నా ప్రస్తుతం రచ్చ,ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. అలాగే రామ్ తో ఎందుకంటే ప్రేమంటే చిత్రం కూడా చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంటలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్.

Posted by Andhra Gossips on 21:39. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips