Upasana Biggest Problem
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాదే వీరి వివాహం జరుగబోతోంది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు మెగా కుటుంబీకులు.
అందగాడు, మంచి మనసున్నోడు అయిన రామ్ చరణ్ ను పెళ్లి చేసుకుంటున్న ఉపాసన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందనేది కొత్తగా చెప్పాల్సిన అవపరం లేదు. పైగా ఇద్దరు చిన్న నాటి నుంచి స్నేహితులు, ప్రేమికులు కూడా. ఒక వేళ ఏమైనా సమస్యలు వచ్చినా ఇద్దరి మధ్య మంచి అండస్టాండింగ్ ఉంటుందనేది కాదనలేని వాస్తవం.
అయితే...ఉపాసనకు పెళ్లి తర్వాత ఒక సమస్య మాత్రం తప్పేట్లు కనిపించడం లేదు. మీడియా కంట పడకుండా తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏర్పడటమే ఆ సమస్య. ఇతర రాష్ట్రాల్లో మీడియా సంగతేమోగానీ..మన రాష్టంలో మీడియా వాళ్లు సెలబ్రిటీ కనిపిస్తే మూకుమ్మడిగా చాలా వాళ్ల మీద పడిని నానా ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. మరి ఇంత కాలం స్వేచ్చగా హైదరాబాద్ లో తిరిగి ఉపాసన...ఈ మీడియా వాళ్లతో ఎలా వేగుతుందో.
