|

మాఫియా డాన్‌గా మారుతున్న వెంకటేష్


విక్టరీ వెంకటేష్, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందనే విషయం తెలిసిందే. పరుచూరి ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి వెంకీ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విభిన్న తరహా చిత్రాలపై దృష్టి సారించిన వెంకటేష్ తన కెరీర్లో తొలిసారిగా డాన్ పాత్రలో కనిపించనున్నారు. తన వయసుకు తగిన పాత్ర కావడంతో దీనిపై ఎంతో ఎక్స్టైటింగ్ ఉన్నాడట ఈ విక్టరీ హీరో. 

మెహర్ రమేష్ గతంలో ‘బిల్లా’ చిత్రంలో ప్రభాస్ ను డాన్ గా చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కాస్త నిరాశ పరిచినా, ఆ సారి మాత్రం వెంకటేష్ కోసం పక్కా స్క్రిప్టుతో రెడీ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. రీచా గంగోపాధ్యాయ ఇందులో హీరోయిన్ గా ఎంపిక కాగా, జగపతి బాబు ముఖ్య పాత్రను పోషించనున్నాడు. కోన వెంకట్, గోపీ మోహన్ ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ డైలాగులు రచించే పనిలో నిమగ్నమై ఉన్నారు. 

ప్రస్తుతం వెంకీ నటించిన ‘బాడీగార్డ్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో వెంకీ సరసన త్రిష్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.


Posted by Andhra Gossips on 06:11. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips