|

CM Movie with Balayya is False : YVS

“I am not doing any movie with Balakrishna at present. Some channels have reported that I am doing a project titled ‘CM’ with Balakrishna in the direction of Krishna Vamsi. It is absolutely false news and I have no relation whatsoever to any project involving Balakrishna and Krishna Vamsi ” said Y.V.S.


నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ‘కామన్ మ్యాన్’ చిత్రం రూపొంద బోతోందని, దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి బ్యానర్‌పై నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పలు టీవీ ఛానళ్లలో కూడా జోరుగా ప్రచారం మొదలైంది. రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందని, త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్సవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు అభిమానులను కూడా ఊత్సాహ పరిచాయి.


అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ వార్తలను వైవిఎస్ చౌదరి ఖండించారు. తాను బాలకృష్ణతో గానీ, కృష్ణ వంశీతో గానీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదని....‘సీఎం(కామన్ మ్యాన్)’ సినిమా తాను నిర్మిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ సినిమాతో తనకు గానీ, బొమ్మరిల్లు బ్యానర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వైవిఎస్ చౌదరి స్పష్టం చేశారు.



ఇటీవల రవితేజ హీరోగా ‘నిప్పు’ చిత్రం రూపొందించిన వైవిఎస్...ప్రస్తుతం మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజతో ‘రేయ్’ చిత్రం రూపొందించడంలో బిజీగా గడుపుతున్నాడు.


Posted by Andhra Gossips on 08:41. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips