మనీషా కొయరాల జీవితంపై సినిమా
నేపాలీ బ్యూటీ మనీషా కొయరాలా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ చిత్రం మనీషా జీవిత చరిత్ర ఆధారంగానే అని వినపడుతోంది. 1990-2005 ల మధ్య జరిగిన ఆమె జీవత ఎత్తు పల్లాలను సినిమాలో చూపిస్తాడని చెప్పుకుంటున్నారు.
అలాగే ఆమె ఆల్కహాల్ కు బానిస అవ్వటం,ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం ఇలా ఇబ్బందికరంగా తయారవటం ప్రధానాంశాలు అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో ఆమె వివాహ జీవితం ఫెయిల్యూర్ అవ్వటం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శకుడు మధూర్ ఖండిస్తున్నాడు. నో..నో..నా చిత్రం ప్రత్యేకంగా ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కాదు అంటున్నాడు. ఇక రీసెంట్ గా మనీషా కొయరాల తాగి ఓ పంక్షన్ కి వెళ్లి మీడియా కళ్లల్లో పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలకు ట్రై చేస్తోంది.
