Mahesh and Rajamouli Going for a Big Budget Movie
According to grapevine, Rajamouli has already given nod to direct Mahesh Babu in a big-budgeted movie.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. సెన్సేషన్ సినిమాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే సినీ ప్రేమికుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు అవధులు దాటి పోవడం ఖాయం. ఇది త్వరలోనే ఆచరణలోకి రాబోతోందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేశారని, శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేసిన మహేష్ రాజమౌళితో సినిమా చేయడంపై ఆసక్తి గా ఉన్నారని, అయితే ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిస్తే మరో ఇండ్రస్ట్రీ బ్లాక్ బస్టర్ ఖాయమని, మహేష్ బాబు నెం.1 స్థానం అందుకోవడం కన్ ఫర్మ్ అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి ‘ఈగ’ అనే ప్రయోగాత్మక గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు.