Mahesh Babu Expecting Second Child
మహేష్ బాబు, నమ్రత శిరోధ్కర్ జంట మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ వార్త ప్రచరించింది. ఆ వార్తలో .. కొద్ది రోజుల క్రితమే నమ్రత ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద కన్ఫర్మ్ చేసిందని చెప్పారు. దాని నిమిత్తం కుటుంభ సభ్యులు, క్లోజ్ ప్రెండ్స్ పార్టీ చేసుకున్నారని రాసారు. ప్రస్తుతం వీరికి గౌతమ్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. 2006లో గౌతమ్ జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే దూకుడుతో 2011 లో రికార్డులు తిరిగరాసి తనదే ఆ సంవత్సరం అనిపించుకున్న మహేష్ మరో హిట్ కు రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరంలో ది బిజినెస్ మ్యాన్ తో రంగంలోకి దిగుతున్నాడు. అలాగే 2012లో మహేష్‌బాబు డైరీ కూడా పూర్తిగా ఫిలప్ అయ్యిపోయింది. మహేష్ ఇక గ్యాప్ రాకూడదని, ఇదివరకటి పరిస్ధితి రిపీట్ కాకూడదని, కంటిన్యూగా సినిమాలు ఒప్పుకొన్నారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో పాటు సుకుమార్ సినిమా కూడా మహేష్ బాబు చేస్తున్నారు. ఈలోగా మరిన్ని కథలు వినిపించడానికి స్టార్ డైరక్టర్స్ రెడీగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి ఆయన ది బిజినెస్ మ్యాన్ చిత్రంతో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకున్నారు. పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ ..సూర్య అనే పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు విడుదలై మంచి విజయం సాధించాయి. అలాగే పస్ట్ లుక్, ట్రైలర్స్ కూడా ఈ చిత్రంపై మంచి క్రేజ్ ను కలగచేస్తున్నాయి.
