పెళ్లి పేరుతో కోట్లు దోచిన ప్రభుదేవా! మోసపోయిన నయన!
Nayanthara's family strongly condemned Prabhu Deva for cheating Nayanthara. In an interview they alleged that Prabhu Deva swindled crores of money from the actress and now eloped.
పెళ్లి చేసుకుంటానని చెప్పి నయనతారను ప్రభుదేవా మోసం చేశాడని, ఆమె వద్ద నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నాడంటూ ఆమె కుటుంబ సభ్యులు వాపోయినట్లు ఓ తమిళ పత్రిక పేర్కొంది. పెళ్లి కోసం నయనతార క్రైస్తవ మతాన్ని వీడి హిందూ మతం పుచ్చుకుందని, ఆమెను మోసం చేయడం తమిళ సినీనటులకు అలవాటైందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది.
ఆ పత్రిక కథనం ప్రకారం... ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘ఎంగేయం కాదల్’ అనే తమిళ చిత్రం కోసం నయనతార కోట్లాది రూపాయలు సాయం చేసింది. డబ్బు మనిషిగా మారిన ప్రభుదేవా నయన మనసు అర్థం చేసుకోలేదు. నయనతార ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని, సినిమాలకు స్వస్తి చెప్పి ఇంటికి వస్తే మంచి యువకుడి చూసి పెళ్లి చేస్తామని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నయనతార-ప్రభుదేవా మధ్య విబేధాలు వచ్చాయని, విడిగా ఉంటున్నారని, ఇక వారి బంధం తెగినట్లే అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాగా నయనతార కుటుంబ సభ్యుల ప్రకటనతో ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుంటారనేది స్పష్టం అవుతోంది.
