Nitya Menon has Banned
Tinsel town is there of it's pros and cons. Budding actress Nithya Menon grabs the headline always. The actress has now been banned by the Malayalam cinema by their producers association for her arrogant attitude.
హాట్ మలయాళీ కుట్టి నిత్యా మీనన్‌పై కేరళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఆమెపై నిర్మాతలు నిషేదం విధించడానికి కారణం నిత్యామీనన్ తలపొగరు ప్రవర్తనే. ఇటీవల ఓ ప్రముఖ మలయాళీ నిర్మాత తన సినిమాలో నిత్యాను తీసుకోవాలనే విషయమై ఆమెతో మాట్లాడటానికి వెళ్లాడట. అయితే నిత్య మీనన్ అక్కడ ఉండి కూడా ఆ నిర్మాతను కలవకుండా తన మేనేజర్‌తో మాట్లాడాలని మెసేజ్ పంపిందట. ఈ ఒక్క నిర్మాత విషయంలోనే కాదు, చాలా మంది మలయాళీ నిర్మాతల విషయంలోనూ అమ్మడు ఇలానే తన పొగరుబోతు తనం ప్రదర్శిస్తోందట. దీంతో చిర్రెత్తిన నిర్మాతలంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసి నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఇతర దక్షిణాది సినిమా రంగాలైన తెలుగు, తమిళ, కన్నడంల్లోనూ నిత్య మీనన్‌పై బ్యాన్ విధించేలా ప్రయత్నాలు చేస్తున్నారట.
నిత్య మీనన్ ప్రస్తుతం నితిన్ తో కలిసి ‘ఇష్క్’ సినిమాలో నటిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. దీంతో పాటు నారా రోహిత్‌తో కలిసి ఒక్కడినే అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు