Pawan Kalyan Dance for Chiru Song
పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పాట కు డాన్స్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రంలో ఈ సీన్ కనపడనుంది. ముఠా మేస్త్రిలోని సూపర్ హిట్ సాంగ్ ఈ పాటకు నేనే మేస్త్రి లోని మొదట చరణం కు పవన్ డాన్స్ చేసి చిరు అభిమానులను అలరించనున్నారు. అయితే ఈ పాట రింగ్ టోన్ గా వస్తుంది. రౌడీలతో ఫైట్ చేసేటప్పుడు ఈ రింగ్ టోన్ మ్రోగినప్పుడు పవన్ ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఫైట్ చేస్తూంటాడు. మార్కెట్ యార్డ్ లో విలన్ వచ్చి ఆక్యుపై చేసి హంగామా చేస్తున్నప్పుడు పవన్ వచ్చి ఈ డాన్స్ తో కూడిన ఫైట్ చేస్తాడు.
ఒరిజనల్ దబాంగ్ లోనూ సల్మాన్ ..జ్వాలా జ్వాల మ్యుజిక్ కి డాన్స్ చేస్తారు. అలాగే తమిళ రీమేక్ ఓస్తిలోనూ అలాంటి సీన్ పెట్టారు. అలాగే ఈ చిత్ర్లంలో కబ్బడి ఫైట్ కూడా ఉందని,అది హైలెట్స్ లో ఒకటి కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ చాలా స్టైలిష్ గా పంచ్ డైలాగులో అదరకొట్టి తన అబిమానులను ఆనందింపచేస్తాడని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు.. ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
