|

Pawan Kalyan was Replaced by Hero Ram


బిందాస్ చిత్రంతో పరిచయమై,రగడ చిత్రంతో మాస్ డైరక్టర్ గా సెటిలైన దర్శకుడు వీరూ పోట్ల. ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో చిత్రం చేయనున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హీరో మారారు. వీరూ పోట్ల చెప్పిన కథ నచ్చకపోవటంతో ఇప్పుడు ఆ కథ రామ్ దగ్గరకి వెళ్లింది. రామ్ కథ విన్న వెంటనే ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని నటనలో అనుకరించే రామ్ కి ఈ ప్రాజెక్టు ఓకే చేయటం జరిగింది.

ఇక వీరూపోట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి దర్శకుడుగా కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. అలాగే మహేష్ తో దూకుడు చిత్రం నిర్మించిన అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో తమ బ్యానర్ ద్వారానే బిందాస్ తీసి వీరూపోట్లని దర్శకుడుగా పరిచయం చేసారు. ఇక రగడ చిత్రంతో నాగార్జున ని మాస్ హీరోగా బాగా ఎలివేట్ చేయటంతో మిగతా పెద్ద హీరోలందరి దృష్టీ వీరూపోట్లపై పడింది. ఇక ఎలాగైనా రామ్ తో హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో వీరూ పోట్ల ఉన్నారు. ఇక రామ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రం చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం తెరకెక్కనుంది. కందిరీగ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ఇదే.

Posted by Andhra Gossips on 19:19. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips