మహేష్ బాబుతో యూవీ లవ్వర్
క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం నడిపిందనే వార్తలతో పాపులారిటీ పెంచుకున్న బెంగుళూరు హాట్ మోడల్ అక్షర గౌడకు అనుకోని అవకాశం దక్కించింది. మహేష్ బాబు సినిమాలో ఈ భామకు నటించే అవకాశం దొరికిందని, సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న మహేష్ సినిమాలో అక్షరకు ఓ ముఖ్య పాత్రను కేటాయించారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఆ పాత్ర ఎలాంటిది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏంజెలా జాన్సన్ పేరు కూడా పరీశీలినలో ఉన్నప్పటికీ చివరకు అక్షర గౌడను ఖరారు చేశారట.
ఈ చిత్రంలో మహేష్ బాబు లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు. స్వతహాగా లెక్చరర్ నుంచి దర్శకుడిగా మారిన సుకుమార్‌కు కాలేజీ బ్యాగ్రౌండ్ స్టోరీలను పర్ ఫెక్టుగా హ్యాండిల్ చేస్తాడనే మంచి పేరుంది. . 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ‘దూకుడు’ నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ సరసన సమంత, వెంకీ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
