Balakrishna VS Ram Charan
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఏప్రియల్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున బాలకృష్ణ అధినాయకుడు చిత్రం కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల అయితే ధియోటర్స్ సమస్య వస్తుందేమోనని భావిస్తున్నారు. అందులోనూ అధినాయుకుడు కి ఇంకా ధియోటర్స్ ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే రచ్చకి పూర్తిగా ఏయో ధియోటర్స్ లో విడుదల చేయాలో ప్లాన్ చేసి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అయితే ఒక గమ్మత్తైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు మెగాభిమానులు, అటు నందమూరి అభిమానులు ఇద్దరూ తమ తమ హీరోల సినిమాలను భారీ ఓపినింగ్స్ ఇస్తారు. అందులోనూ రెండు చిత్రాలపైన భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. రెండు చిత్రాలు ఆడియోలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. రచ్చలో హైలెట్స్ తరహాలోనే బాలయ్య అధినాయకుడు లో కూడా మూడు పాత్రలలో బాలకృష్ణ కనపడటం,పొలిటికల్ నేపధ్యంలో కథ జరగటం వంటివి ఉన్నాయి. దాంతో ఇరు పక్షాలు అభిమానులు చాలా ఆసక్తిగా ఈ పరిణామానాన్ని వీక్షిస్తున్నాయి.
