Bunny is Good Dancer than Me:Charan
'Bunny is a more complete dancer and I respect his abilities a lot' said Charan.
మెగా కుటుంబ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటా పోటీగా తామేంటో నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. నటన విషయంలోనూ, డాన్సులు, ఫైట్స్ ఇలా ఏ విషయంలో తీసుకున్నా ఎవరికి వారే సాటి. అయితే చరణ్ మాత్రం ఈ విషయం ఒప్పుకోవడం లేదు. డాన్సులు చేయడంలో నా కంటే బన్నీ బెటర్ అంటున్నాడు. బన్నీ కంప్లీట్ డాన్సర్, నేను అతని సామర్ధ్యాలు చాలా గౌరవిస్తాను అంటున్నాడు. అన్న పూర్ణ స్టూడియోలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు పై విధంగా స్పందించాడు చెర్రీ. ఒక రోజు ముందుగానే చరణ్ ఈ రోజు తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియలో పాట చిత్రీకరణ అనంతరం చిత్రం యూనిట్ పొల్లాచ్చి వెలుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ జరుగుతుందని చరణ్ తెలిపాడు. రచ్చ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందన్నాడు. సినిమా విడుదల విషయమై తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, తప్పకుండా ఈ సినిమా అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుందన్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో చర్రీ సరసన తమన్నా నటిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
