Disputes on Ram Charan Racha
రాంచరణ్ తేజ నటించిన ‘రచ్చ’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ‘రచ్చ’ చిత్రంలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుని విగ్రహం ముందు ఆశ్లీల దృశ్యాలు చిత్రీకరించారని, వెంటనే ఈ చిత్రం యూనిట్ పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ మేరకు మహిళా సంఘాలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాయి. ఆరెంజ్ చిత్రం తరువాత రాంచరణ్ తేజ ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. అలా మొదలైంది తరువాత సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలె విడుదలయింది.
