Isha Sharvani Rejects Kamal Hassan
హీరో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ‘విశ్వరూపం’ సినిమా కోసం గత కొంత కాలంగా హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్లుగా చాలా మందిని ఎంపిక చేశారు. అయితే వచ్చిన వారు వచ్చినట్లు ఏదో ఒక కారణంతో సినిమా నుంచి బయటకు వెళ్లి పోతూనే ఉన్నారు. సోనాక్షి సిన్హా, సమీరారెడ్డి ఇలా చాలా మంది బాలీవుడ్ పాపలు ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించింది.
తన చిత్రంలో హీరోయిన్ గా నటించాలంటూ బాలీవుడ్ హీరోయిన్ ఇషా శర్వానీకి కమల్ హాసన్ ఆఫర్ ఇచ్చినా.....డేట్స్ అడ్జెస్ట్ కాని కారణంగా ఆ ఫరర్‌ను తిరస్కరించిందట ఇషా. కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోతో చేసే అవకాశాన్ని కోల్పోవడంపై చాలా ఫీల్ అవుతోంది. భవిష్యత్ లో మరోసారి అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోను అంటోంది.
సూర్య హీరోగా వస్తున్న మాట్రాన్ చిత్రం ద్వారా ఇషా శర్వాని తొలిసారిగా తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతోంది. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్-థ్రిల్లర్ గా రూపొందుతోంది. మరో వైపు ఈ భామ విక్రమ్ హీరోగా వస్తున్న బాలీవుడ్ మూవీ ‘డేవిడ్’ చిత్రంలోనూ నటిస్తోంది.
