ఎన్టీఆర్ బన్ గయా ‘బాద్ షా’
ఎన్టీఆర్ కథానాయకుడిగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘బాద్‌షా’ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. ఎన్టీఆర్‌పై ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్ నివ్వగా వెంకటేష్ కెమెరా స్విఛాన్ చేశారు. డా.డి. రామానాయుడు దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేశారు.
ఈ సంధర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘దూకుడు’ లాంటి సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది.ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్‌తో పాటు ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 20 నుంచి విదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. నిర్మాత మాట్లాడుతూ బండ్ల గణేష్ ‘‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీనువైట్లతో ఆ స్థాయి సినిమా చేయాలన్న ఆలోచనతో చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ఎన్టీఆర్‌కు, శ్రీనువైట్లకు, మా సంస్థకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవాలన్న ఆశతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాను అని అన్నారు.
