|

‘దమ్ము’లో ఆమె ఐటం సాంగ్ హైలెట్


ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దమ్ము’లో ‘తూరుపు ... అనే పల్లవితో సాగే హుషారైన ఐటం సాంగ్ ఉంది. కీరవాణి స్వరపరిచిన ఆ పాట లో రచనా మౌర్య హాట్ హాట్ గా డాన్స్ చేసి కైపెక్కించనుందని సమాచారం. వరసగా గతంలో ‘శౌర్యం’, మిత్రుడు’, నందీశ్వరుడు’ చిత్రాల్లో ఐటం సాంగ్ లు చేసిన ఈ ముద్దు గుమ్మ తొలిసారి ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’చిత్రం కోసం అదిరిపోయే రేంజిలో చిందులు వేస్తోంది. ఈ పాటతో ఆమె తెలగులో ఐటమ్ గర్ల్ గా సెటిల్ అవుతానని భావిస్తోంది. 


బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 29న విడుదల కానుంది. చిత్రాన్ని ఏప్రిల్‌లో సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తీకలు కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగానూ,ఫ్యాక్షనిస్టుగానూ కనిపించి అలరించనున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని సింహాకు మించిన హిట్ చెయ్యాలనే కసితో చేస్తున్నట్లు వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో డైలాగులు సైతం నందమూరి అభిమానులు విజిల్స్ వేసే రేంజిలో ఉంటాయని చెప్తున్నారు.


Posted by Andhra Gossips on 00:39. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips