Kajal's Bollywood Film on Theft
టాలీవుడ్ హాట్ బ్యూటీ కాజల్ రీసెంట్ గా ఓ హిందీ చిత్రం కమిటైంది. ఆ చిత్రం కాన్సెప్ట్ వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందిస్తున్నారు. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్ 'స్పెషల్ ఛబ్బిస్' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జువెలర్స్ ఒపెరా హౌస్ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్ ముసుగులో మోన్ సింగ్ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ లోనూ, కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్‌లతో ఈ ఉత్తరాది భామ ఒక్కో సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఆమె ఆచి తూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది. కాజల్ అగర్వాల్ 2010లో వచ్చిన అజయ్ దేవ్‌గన్ సినిమా 'సింగం'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
'స్పెషల్ చబ్బీస్'ని వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే అనుపమ్ ఖేర్, జిమ్మి షెర్గిల్ మీద చిత్రీకరణ మొదలుపెట్టారు. మార్చి 1 నుంచి ఢిల్లీలో నాయకానాయికలపై కొన్ని సన్నివేశాల్ని తీయనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇక ఈ చిత్రం విజయం ఆమెకు కీలకంగా మారనుంది. ఎందుకంటే సింగం సినిమా హిట్టైనా కాజల్ పెద్దగా పేరు రాలేదు. చిన్న చిన్న హీరోల ప్రక్కన మాత్రమే ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం కనుక హిట్టైతే నెక్ట్స్ సల్మాన్ ఖాన్,హృతిక్ రోషన్,షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ ప్రక్కన ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగులో చేసిన త్రిష, అసిన్, జెనీలియా,ఇలియానా లు అక్కడ నిలదొక్కుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
