మహేష్ బాబు నేషనల్ డీల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మైలు రాయిని అందుకున్నారు. ఇప్పటి వరకు కేవలం మన రాష్ట్రం పరిధిలోనే పలు కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్ తొలిసారిగా నేషనల్ స్థాయిలో డీల్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం థమ్సప్ సాప్ట్ డ్రింగ్ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఈ హీరో థమ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు వరకు థమ్సప్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొనసాగుతూ వచ్చాడు. అతనితో కాంట్రాక్టు ముగియడంతో మహేష్ బాబు ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు. వరుస విజయాలతో రాష్ట్రంలోనే కాక రాష్ట్రం బయట కూడా రోజు రోజుకు పాపులర్ అవుతున్న మహేష్ బాబు వల్ల తమ కంపెనీ ఉత్పత్తులు మరింత పెరుగుతాయని ఆ కంపెనీ భావించి ఆయతో డీల్ కుదుర్చుకున్నట్లు మహేష్ బాబు సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
రాష్టం నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరో మహేష్ బాబే కావడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ పరిధిలోనే మహేష్ బాబు బ్రాండ్ విలువ కొన్ని కోట్లలో ఉంది. మరి నేషనల్ స్థాయిలో మహేష్ బాబు విలువ ఏ రేంజ్‌లో ఉంటుందో మరికొన్ని రోజుల్లో వెల్లడి కానుంది.
