Mahesh Item Girl is Back For Mahesh
రాత్రైనా నాకు ఓకే..పగలైనా నాకు ఓకే అంటూ అతిధి చిత్రంలో అదరకొట్టిన ఐటం బాంబు గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావటంతో మళ్లీ ఆమెను తెలుగులో ఎవరూ ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే దబాంగ్ చిత్రంలో ఆమె ఒక్కసారిగా మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో మళ్లీ ఆమెను తన చిత్రంలో నటింపచేయాలని మహేష్ ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను ఐటం సాంగ్ తీసుకోవాలని సుకుమార్ సైతం ఉత్సాహం చూపిస్తాడని చెప్తున్నారు.
అయితే ఇంకా ఈ మ్యాటర్ చర్చల స్ధాయిలోనే ఉందని చెప్తున్నారు. మొదటి నుంచి సుకుమార్ తన చిత్రాల్లో ఐటం సాంగ్ లకి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. మహేష్ కూడా తాజాగా దూకుడు,బిజినెస్ మ్యాన్ లలో ఐటం సాంగ్ లు ఇరగతీయటంతో తప్పని సరిగా ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ఐటం సాంగ్ తప్పనిసరి అని తేలిపోయింది. అలాగే ఆ ఐటం సాంగ్ కూడా ఓ రేంజి లో ఉండాలనే మలైకా అరోరాని సంప్రదిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ ..దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.
