రెండుగా చీలిన నందమూరి ఫ్యాన్స్
And right now, it is heard that Balayya fans are very unhappy on NTR fans. Sharing his thoughts, the secretary of one of Balayya’s fan association mentioned “Balayya Babu is arriving with ‘Srirama Rajyam’ on October 6th and on October 23rd NTR is arriving with ‘Oosaravelli’.
నందమూరి ఫ్యాన్స్ అంటే సాధారణంగా ఆ కుటుంబానికి చెందిన హీరోలందరినీ అభిమానిస్తుంటారు. నందమూరి వంశంలో ఏ హీరో సినిమా హిట్టయినా సంబర పడిపోతారు. అయితే ఇప్పడు ఈ అభిమానులు ఇప్పడు రెండుగా చీలి పోయారు. ఓ వర్గం బాలయ్య వైపు నిలిస్తే, మరో వర్గం జూ.ఎన్టీఆర్ కు సపోర్టుగా పని చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తీరు నచ్చడం లేదని బాలయ్య అభిమానులు ఆయన్ను పక్కన పెడితే, అబ్బాయ్ ఎదుగుదలకు సహకరించడం లేదని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యను వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ పై కోపంగా ఉన్నారు. అక్టోబర్ 6న ‘శ్రీరామ రాజ్యం’ సినిమా విడులవుతోందని తెలిసినా, అదేనెలలో రెండు వారాల గ్యాప్‌తో జూనియర్ తన ‘ఉసరవెల్లి’ని విడుదల చేస్తుండటమే ఇందుకు కారణం. ఇలా అయితే ఇద్దరి సినిమాలకు నష్టం వాటిల్లుతుందనేది వారి ఆందోళన. ఈ విషయంలో బాబాయ్, అబ్బాయ్ పునరాలోచించుకోవాలని సూచిస్తూనే, జూనియర్ తన సినిమా విడుదలను మరికొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిదని వాదిస్తున్నారు.
