గబ్బర్ సింగ్ ఆడియోకు మెగా ఫ్యామిలీ రాదా..?! ఎందుకు..?!!
చిరు ఫ్యామిలీ గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవలే 'రచ్చ' ఆడియో నాడు పవన్ కళ్యాన్ అమెరికాలో ఉన్నాడనీ... మీటింగ్ పెట్టి మరీ భుజాలు తడుముకున్నారు గబ్బర్ సింగ్ నిర్మాత దర్శకుడు గణేష్, హరీష్‌శంకర్. అసలు పవన్ రాకపోవడానికి వారికీ ఎటువంటి సంబంధంలేదు. కానీ... పవన్ కళ్యాణ్ మనసులోని మాటగా వారు చెప్పినట్లు తెలియజేశారు.
ఆ మరునాడే.. పవన్‌కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ఎస్‌ఎస్ రాజమళితో సహా పలువురు హాజరయ్యారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. పూజానంతరం అల్లు అర్జున్ సెపరేట్‌గా వచ్చారు. అతను సోలోగా వచ్చి వెళ్ళినట్లు ఫొటోలు మీడియాకు రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా, గబ్బర్‌సింగ్ ఆడియో ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ తెలియజేశారు. ఈ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీ వస్తుందా..? రాదా..? అనే ఉత్కంఠ ఉంది. అందుకే డైరెక్ట్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
