కష్టాల్లో రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని అదే పేరుతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే చెర్రీ నటించబోయే ఈ చిత్రానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ‘జంజీర్’ ఒరిజినల్ రచయితలు సలీమ్, జావేద్‌లు కోర్టుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
తమ అనుమతి లేకుండానే ఈచిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది చాలా అభ్యంతరకరమని రచయిత జావేద్ అక్తర్ అంటున్నారు. సహ రయిత సలీమ్ ఖాన్‌తో కలిసి నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జంజీర్ రీమేక్‌ను ప్రకాష్ మెహతా నిర్మిస్తుండగా, అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తర్వాత చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’, వివి వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రానికి కమిట్ అయ్యాడు.
