Trisha Crosses the Border Jr NTR
హీరోయిన్ త్రిష సినిమాల్లోకి వచ్చి దశాబ్ద కాలం దాటి పోయింది. ఇన్నేళ్ల కెరీర్లో సాంప్రదాయ బద్దంగానే రాణిస్తూ వచ్చింది ఈ అమ్మడు. ఎక్స్ ఫోజింగ్, శృతి మించిన శృంగార సీన్లకు దూరంగా ఉంటూనే ఉంది. రెండు మూడేళ్లుగా కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో బట్టల సైజు కాస్త తగ్గించింది కానీ బరితెగించలేదు. తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, తమిళ వెర్షన్ ఏ మాయ చేసావె చిత్రంలో శింబుతో లిప్ లాక్ సీన్లు చేసినా అవి కథానుసారంగా అందంగా ఉన్నాయి. అందుకే త్రిషపై ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఇప్పటికీ అభిమానం ప్రదర్శిస్తూనే ఉన్నారు.
అయితే త్రిష తొలిసారిగా హద్దు దాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ జూ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో త్రిష గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎక్స్ ఫోజింగ్ చేయడంతో పాటు, ఎన్టీఆర్‌తో హాట్ హాట్ గా రొమాన్స్ చేస్తోందని తెలుస్తోంది. దమ్ము చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటనతో పాటు త్రిష హాట్ అందాల ఆరబోత ప్లస్సయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమా చిత్రీకరించారని చర్చించుకుంటున్నారు. మరి త్రిష ఈ చిత్రంలో ఏ రేంజ్ లో రెచ్చి పోయిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న దమ్ము చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 19న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
