Two Big Stars Fans Clash
చింత చచ్చినా.. పులుపు చావలేదు అంటే ఇదేనేమో! ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేషన్. ఇద్దరు హీరోలు ఇప్పుడు భౌతికంగా జీవించి లేక పోయినా.... వారి అభిమానుల గుండెల్లో మాత్రం వారు వారు ఇంకా బ్రతికే ఉన్నారు. అప్పట్లో ఈ ఇద్దరు హీరోలు పోటీ పోటీగా ఉండే వారు. అభిమానులు కూడా ఒకరిపై ఒకరు కత్తులు తూసుకునే వారట. ఆ పోకడ వారిలో ఇప్పటికీ అలానే మిగిలి ఉంది.
ఇటీవల శివాజీ గణేషన్ నటించిన ‘కర్ణన్’ మూవీ డిజిటల్ వెర్షన్‌ను తమిళనాట విడుదల చేశారు. దీనికి పోటీగా ఎంజీఆర్ అభిమానులు ఆయన నటించిన ‘కుడి ఇరుంత కోయిల్’ అనే చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో అభిమానుల గొడవ వచ్చిందని, థియేటర్ల వద్దనే బాహాబాహీకి దిగినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. తమ హీరోల కోసం అభిమానులు ఎంతకైనా తెగించడం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుండటంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.
మన తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఇలాంటి పోకడలు లేవు కానీ...ఇప్పుడిప్పుడే మన దగ్గర శృతి మించిన అభిమానం వేళ్లూను కుంటోంది. ఆ మధ్య తెలుగు స్టార్ హీరోల అభిమానుల మధ్య జరిగిన కోల్డ్ వార్, ఒకరి హీరోలను ఒకరు దూషిస్తూ ప్లెక్సీ వార్‌కు దిగిన విషయం తెలిసిందే.
