He Charged 5 Crores For a Telecom Add
Actor Vijay is the latest to join the bandwagon of Kollywood stars to do a commercial for a well-known national telecom company. The actor, apparently will be paid Rs 5 crore for the advertisement.
మన తెలుగు హీరోల్లా తమిళ హీరో విజయ్ కూడా తాజాగా సైడ్ బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అంటే... కమర్షియల్స్ యాడ్స్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఓ జాతీయ టెలికం కంపెనీకి బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించడానికి విజయ్ సైన్ చేశాడు. అందుకోసం అత్యధిక మొత్తంలో అంటే, ఐదు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. ఈ అడ్వర్ టైజ్మెంట్ షూటింగు మూడు రోజుల పాటు జరుగుతుంది. మామూలుగా తమిళ హీరోలు మన హీరోల్లా కమర్షియల్స్ అంత ఎక్కువగా చేయరు. ఒక్క టెలికాం కంపెనీలకే చేస్తుంటారు. సూర్య, కార్తీ కూడా అలాగే రెండు టెలికాం కంపెనీలకు బ్రాండ్ అంబాసడార్ గా చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా వీరి బాటలో పయనిస్తున్నాడన్న మాట.
కాగా ఇటీవల వచ్చిన పలు తమిళ అనువాద చిత్రాలు తెలుగులో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో....మరికొందరు తెలుగు సినిమా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సూర్య, విక్రమ్, విశాల్ లాంటి హీరోలు తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించగా, ఆర్య, జీవ లాంటి హీరోలు ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై తమ సక్సెస్ రేటును పెంచుకుంటున్నారు.
తాజాగా తమిళ హీరో విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. తన తాజా సినిమా 'ఆది" సినిమాను తమిళంతో పాటు, తెలుగులో 'నేనేరా ఆది" పేరుతో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ చిత్రం 'త్రీ ఇడియట్స్" తమిళ రీమేక్ 'నన్బన్" చిత్రంగా షూటింగ్ పూర్తి కావస్తోంది.
