I Love to Dance With Pawan Kalyan
పవన్ తో డాన్స్ అంటే నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను అంటోంది మలైకా ఆరోరా. ఆమె రీసెంట్ గా పవన్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ఆమెను ఐటం సాంగ్ కి తీసుకున్నారు. అక్షరాలా కోటి రూపాయలు ఆఫర్ చేసి మరీ బుక్ చేసుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ...నేను ఏ సినిమాకు పడితే దానికి ఐటం సాంగ్ లు చేయను. చాలా సెలక్టివ్ గా చేస్తూంటాను. దబాంగ్ తర్వాత నేను రెండేళ్ల తర్వాత హౌస్ ఫుల్ 2 లో అనార్కలీ డిస్కో చలీ ఐటం సాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్లీ తెలుగులో ఈ సాంగ్ కి కమిటయ్యాను అంది.
మరి అంత సెలక్టివ్ గా ఉండే మీరు తెలుగులో అనగానే ఎందుకు ఒప్పుకున్నారు అనగానే ఆమె ఇమ్మిడియట్ గా...ఎందుకు ఎస్ చెప్పకూడదు. ఈ చిత్రం దబాంగ్ కు అఫీషియల్ రీమేక్. దబాంగ్ చిత్రంలో నేను చేసిన పాట మంచి సంచలనం క్రియేట్ చేసింది. అలాగే తెలుగులోనూ చేస్తుందనే ఆలోచన ఉంది. అందులోనూ పవన్ చిత్రం అంటే ఓ కొత్త ఎక్సపీరియన్స్. సౌత్ డాన్స్ లంటే నాకు పిచ్చ ఇష్టం అంది. అలాగే తమిళంలో దబాంగ్ రీమేక్ లో చేయలేకపోయానని,అప్పటికీ మల్లికా షెరావత్ ఆ పాట చాలా బాగా చేసిందని మెచ్చుకుంది.
గతంలోనూ మహేష్ బాబు చిత్రం అతిధిలో ఐటం సాంగ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ...తెలుగులో ఆఫర్ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు హీరోలు చాలా మంచి డాన్సర్స్. వారితో పోటీ పడి మరీ డాన్స్ చేయవచ్చు అంది. ఇక తెలుగులో ఆ చిత్రం తర్వాత చాలా మంది ఆపర్ చేసినా తనకు ఇష్టం లేకపోయిందని తేల్చి చెప్పింది. ఇక పాట కూడా తాను విన్నానని,ప్రస్తుతం ఎలా కొరియోగ్రఫీ చేయవచ్చో ప్రాక్టిస్ చేస్తున్నారని,ఈ దసలో దాని గురించి మాట్లాడటం పద్దతి కాదు అంది.
ఇక హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రోమోలు రిలీజ్ అయ్యి సంచలనం క్రియేట్ చేసాయి. పాటలు విడుదల అయిన దగ్గరనుంచి పూర్తి స్ధాయి పబ్లిసిటీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రంలో పంచ్ డైలాగులు, హీరో క్యారక్టరైజేషన్ హైలెట్ అవుతాయని చెప్తున్నారు.
