చెర్రీతో జూనియర్ ఎన్టీఆర్ స్నేహం : నందమూరి ఫ్యామిలీ గుర్రు?
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిత్రం "దుమ్ము". ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవల జరిగింది. సాధారణంగా నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు నటించిన చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు..నందమూరి ఫ్యామిలీ అంతా అక్కడ కొలువై ఉంటుంది.
కానీ, గత గురువారం రాత్రి విడుదలైన 'దమ్ము' ఆడియే విడుదలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరు నందమూరి వంశస్థులు మచ్చుకైనా కనిపించలేదు. ఈ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతిని వెంటబెట్టుకుని రాగా, మిగిలిన వారంతా చిత్ర యూనిట్ టెక్నీషియన్స్, కొంతమంది చిత్ర పరిశ్రమకు చెందినవారే.
ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల ఆడియో ఆవిష్కరణలకు ఖచ్చితంగా సీనియర్ నటుడు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హాజరవుతారు. కానీ వీరిద్దరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే, హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్నలు కూడా అటువైపు తొంగి కూడా చూడలేదు. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ... వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందు వల్లే ఈ నందమూరి సింహాలు 'దమ్ము' ఆడియో ఆవిష్కరణకు దూరంగా ఉన్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం.
అయితే, మరికొంతమంది మాత్రం మరోలా వ్యఖ్యానిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ హీరోలను జూనియర్ ఎన్టీఆర్ విస్మరించారని అంటున్నారు. అంతేకాకుండా, 'జై ఎన్టీఆర్' అంటూ జూనియర్ ఎన్టీఆర్ పదేపదే చేసిన నినాదాలు కూడా వారి ఫ్యామిలీ నుంచి వేరుపడిన సంకేతాలు పంపుతోందని చెపుతున్నారు.
ఇంకొందరు మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ తమ బద్ధశత్రువుంగా ఉండే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌తో సత్ సబంధాలు కొనసాగించడం మిగిలిన నందమూరి హీరోలకు ఏమాత్రం రుచించక 'దమ్ము' ఆడియోకు దూరంగా ఉన్నట్టు భొగొట్టా. ఇటీవల వీరిద్దరు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కథ కుదిరితో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానని రామ్ చరణ్ ప్రకటించారు. ఇది నందమూరి హీరోలకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.
