Balakrishna Entry in Tamil
Manchu Manoj, Bala Krishna’s multi-starrer project Uu Kodathara Ulikki Padathara is simultaneously being made in Telugu and Tamil versions. Currently, the first schedule of the film has been wrapped up in a specially erected set Gandharva Mahal worth Rs 2 crore in Manikonda.
బాలకృష్ణ ఎప్పుడూ తమిళ మార్కెట్ కోసం ఎగబడలేదు.యంగ్ హీరోలంతా ఇప్పుడు తమిళ మార్కెట్ అంటూంటే ఆయన ఇక్కడ మార్కెట్ ని పూర్తిగా ఏలితే చాలు అన్నట్లు కామ్ గా ఉంటున్నారు.ఈ నేపధ్యంలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో రూపొందుతోన్న ఊ కొడతారా..ఉలిక్కిపడతారా చిత్రం తెలుగు,తమిళంలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది.మంచు మనోజ్ పై అంత పెట్టుబడి వర్కవుట్ అవదనే ఇలా ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.అయితే మనోజ్,బాలకృష్ణ తమిళ మార్కెట్ కి ఇద్దరూ కొత్తే కాబట్టి ఎంతవరకూ ఈ వ్యూహం ఫలిస్తుందని తేలాల్సి ఉంది.
దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో మణికొండలో వేసిన గంధర్వ మహల్ సెట్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసారు. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ పాత్ర కీలకమై నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..
తమ సొంత బ్యానర్ పై నిర్మిస్తోంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది